మణిపూర్... ఇంఫాల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని పేల్చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా? అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర్లోనే సంచుల్లో దాచిన ఓ బాంబును సైన్యం గుర్తించింది. వెంటనే బాంబు డిస్పోజల్ టీం రంగంలోకి దిగి... ఆ బాంబును వేరే ప్రాంతానికి తీసుకెళ్లి, పేల్చివేసింది. సైన్యం కనిపెట్టకపోయి ఉంటే... ఆ బాంబు పేలి తీవ్ర నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. గతేడాది జులైలో కూడా ఎయిర్ పోర్ట్ దగ్గరే ఇలాంటి ఓ బాంబును కనిపెట్టి... డిస్పోజ్ చేశారు. మళ్లీ అదే కుట్ర జరగడం ఆందోళన కలిగిస్తోంది.