లద్దాఖ్ బీజేపీ ఎంపీ జమయాంగ్ సెరింగ్ నంగ్యాల్ 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానికులతో కలిసి లేహ్‌లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌచా (లద్దాఖ్ సంప్రదాయ దుస్తులు) ధరించి ట్రెడిషనల్ డాన్స్‌తో అదరగొట్టారు నంగ్యాల్. అంతేకాదు డ్రమ్స్ వాయించి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.