ప్రభుత్వ విధానాల మీద నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని, అయితే, బీజేపీ ప్రభుత్వం తమ అధికారంతో వారి హక్కును కాలరాస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న జాతీయ పౌరసత్వ చట్టం, ఎన్ఆర్సీ ఆందోళనలపై బీజేపీ వైఖరిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.