భారీ వర్షాలు బీహార్‌ను ముంచెత్తుతున్నాయి. రోడ్లపైకి చేరిన వాన నీరు నివాస ప్రాంతాల్లోకి కూడా చేరుతోంది. మరోవైపు పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలోకి వాన నీరు చేరింది. వార్డుల్లోకి వాన నీరు చేరడంతో పేషంట్లు కాలు కింద పెట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.