భారత్ బంద్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలు కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. కార్మిక సంఘాల నేతలు పలు రైళ్లను, వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. బంద్ ప్రభావం పశ్చిమ బెంగాల్, కర్ణాటక, త్రివేండ్రం, హౌరా, విజయవాడల్లో ఎక్కువగా కనిపించింది.