ఇండియన్ ఆర్మీ కోసం మేడిన్ ఇండియా స్నైపర్ రైఫిల్స్ తయారవుతున్నాయి. బెంగళూరులోని SSS డిఫెన్స్ కంపెనీ మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ రైఫిల్స్ తయారు చేసింది. ఇప్పటికే వైపర్, సాబర్ మోడల్ స్నైఫర్ రైఫిల్స్‌ను ఆర్మీకి అందించింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో ఈ రకం ఆయుధాలను గత ఆరు నెలలుగా భారత ఆర్మీ ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తోంది. రైఫిల్స్ డిజైన్ విషయంలో ఆర్మీ పలు కీలక సూచనలు చేసింది. అంతా ఓకే అయితే త్వరలోనే పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనుంది SSS కంపెనీ.