HOME » VIDEOS » National

Video : ప్రధాని మోదీపై బియర్ గ్రిల్స్‌ ప్రశంసల జల్లు...

ఇండియా న్యూస్11:52 AM August 10, 2019

Man Vs Wild : ప్రధాని నరేంద్ర మోదీ... ప్రపంచ ప్రముఖ సాహసవీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన మేన్ వర్సెస్ వైల్డ్ షో జర్నీని డిస్కవరీ ఛానెల్ ఈ నెల 12న ప్రసారం చేయబోతోంది. మోదీ తనతో కలిసి ఎలాంటి సాహసాలు చేశారో... 180 దేశాల వారు చూడాలని బియర్ గ్రిల్స్ కోరాడు. మోదీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పి... ఈ షోపై ఆసక్తిని పెంచేశాడు. ఈ షో షూట్ చేస్తున్నప్పుడు... మోదీ చాలా మౌనంగా ఉన్నారనీ, తమ టీమ్ మొత్తం అల్లరి చేసినా... మోదీ మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటూ... అన్నీ తెలుసుకుంటూ ఆసక్తి చూపించారని బియర్ గ్రిల్స్ వివరించాడు. అడవుల్లో బతకగలగాలంటే... బెర్రీస్, వేర్లు, మొక్కలు వంటివి తినాల్సి వస్తుందన్న బియర్ గ్రిల్స్... మోదీ చిన్నప్పుడు అడవుల్లో తిరగడం వల్ల... ఆయన ఈజీగా తమతో సర్దుకుపోగలిగారని తెలిపాడు.

Krishna Kumar N

Top Stories