బెంగళూరులోని ఓ సెలూన్ ఆసక్తికర ఆఫర్ ప్రకటించింది. తమ దగ్గరకు వచ్చే కస్టమర్లకు మిలిటరీ హెయిర్ కట్, వింగ్ కమాండర్ అభినందన్ తరహా మీసాల స్టైల్ ఫ్రీగా చేసి పెడతామని ప్రకటించింది. ఈ ఆఫర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూత్ క్యూ కట్టి మరీ వెళ్తున్నారు. భారత సైన్యానికి సపోర్ట్ ఇచ్చేందుకే తాము ఈ ఫ్రీ ఆఫర్ ప్రకటించామని సెలూన్ నిర్వాహకులు తెలిపారు. కస్టమర్లు కూడా ఆర్మీకి ఇలాగైనా సపోర్ట్‌గా ప్రకటిస్తామంటూ మిలిటరీ హెయిర్ కట్, అభినందన్ మీసాల్లా చేయించుకుంటున్నారు.