పాకిస్తాన్లో భారత్ జరిపిన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఉగ్రవాదులు తిరిగి పుంజుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జైష్-ఎ-మొహమ్మద్ నడుపుతున్న ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం ధ్వంసంచేసిందన్నారు. ఈ దాడులు జరిగిన దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్ బాలకోట్‌లోని టెర్రర్ క్యాంప్‌లు మళ్లీ చురుకుగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు. ఇటీవల బాలకోట్ రీ యాక్టివ్ అయ్యిందన్నారు. భద్రతా బలగాల కళ్లు కప్పి తప్పించుకోవడానికి టెర్రరిస్టులు కొత్త పేరుతో తిరిగి చర్యలు ప్రారంభింస్తున్నారని రావత్ పేర్కొన్నారు.