అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుండటంతో... దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై సెక్యూరిటీని పెంచాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో... పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇలా కీలకమైన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.