Indian Flash Floods : కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకొని... ఇప్పటికే 66 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కేరళ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.