నేపాల్‌లో ఆగివున్న హెలికాప్టర్‌ను టేకాఫ్ కాబోతున్న విమానం ఢీకొట్టింది. లుక్లాలోని తెన్ జింగ్ హిల్లరీ ఎయిర్ పోర్టు నుంచీ ఖాట్మండుకు బయలుదేరిన విమానం, టేకాఫ్ తీసుకునే క్రమంలో హెలికాప్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోనే ఉన్న సహాయ సిబ్బంది వెంటనే స్పందించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, పర్వత శిఖరాల్లో ఉండే ఈ ప్రాంతానికి వేసవిలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు.