HOME » VIDEOS » National

Video: ఘనంగా హల్వా వేడుక...బడ్జెట్ ప్రింటింగ్ షురూ

ఇండియా న్యూస్15:50 PM January 21, 2019

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ కసరత్తు ముగిసింది. ఇక బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ పనులు మొదలయ్యాయి. ప్రతుల ముద్రణ ప్రారంభానికి ముందు నిర్వహించే హల్వా వేడుక కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా.. తానూ ఓ చేయి వేసి ముఘఘుమలాడే హల్వాను సిద్ధం చేశారు. అనంతరం ఆర్థికశాఖ అధికారులు, ఉద్యోగులకు పంచిపెట్టి...బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్ రాధకృష్ణన్, ఆర్థిక కార్యదర్శి డీఈఏ సుభాష్ గార్గ్ పాల్గొన్నారు. సోమవారం ఆర్థికశాఖ కార్యాలయంలో జరిగిన హల్వా వేడుకకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హాజరుకాలేదు. గత ఏడాది మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్న జైట్లీ..వైద్య పరీక్షల కోసం మళ్లీ అమెరికాకు వెళ్లారు.

webtech_news18

Top Stories