హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రేపటి ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీకి జోరుగా ఏర్పాట్లు

జాతీయం12:57 PM October 10, 2019

PM Modi and Xi Jinping Meeting : భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పిగ్ మధ్య శుక్రవారం కీలకమైన భేటీ జరగనుంది. ఇందుకోసం తమిళనాడులోని... మామల్లపురం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జి జిన్ పింగ్... 11, 12 ఇండియాలో ఉంటారు. చెన్నైని సందర్శిస్తారు. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది తేలాల్సిన ప్రశ్న. ఐతే... కేంద్ర ప్రభుత్వ వర్గాలు... పెద్దగా చర్చించేది ఏమీ ఉండదనీ, రెండు దేశాలకూ సంబంధించిన అంశాలు, వాణిజ్య విషయాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకుంటారనీ, ఐతే... ఏ ఒప్పందాలూ కుదుర్చుకునేది లేదని అంటున్నారు. సో... ఈ భేటీ వల్ల రెండు దేశాల మధ్యా సత్సంబంధాలు మరింత పెరుగుతాయని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది కాబట్టి... ఆ దేశానికి చైనా ఎక్కువగా మద్దతు ఇవ్వకుండా అడ్డుకునేందుకూ, చైనాను మనవైపు తిప్పుకునేందుకూ ఈ భేటీ ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. మామల్లపురం పట్టణ విశిష్టత తెలుసుకున్న యునెస్కో... దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పురాణాల్లో కూడా మహాబలిపురం ప్రస్తావన ఉంది. అందుకే... దీన్ని జిన్ పింగ్‌కి చూపించే ఉద్దేశంతో మోదీ... ఇక్కడ భేటీ ఏర్పాటు చేయించారు. ఇక్కడి సముద్రం పక్కన ఉన్న ఆలయాన్ని జిన్ పింగ్ సందర్శిస్తారు. ఆలయం పక్కనే ఉన్న ఐదు రథాల్ని ఏకశిలతో చెక్కడం విశేషం. జిన్ పింగ్ రాక సందర్భంగా ఈ ఆలయాన్ని సరికొత్తగా ముస్తాబు చేశారు.

webtech_news18