ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ తెలంగాణలోని వైన్ షాప్ ముందు బస్సు ఆపి.. మద్యం కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపక్కన బస్సు ఆగిన తర్వాత.. ఓ కుర్రాడు డ్రైవర్ వద్ద డబ్బు తీసుకొని వైన్ షాప్‌కు వెళ్లాడు. ఓ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి డ్రైవర్‌కు ఇచ్చాడు. బస్సు డ్రైవర్ ఆ మద్యం సీసాను వెనక సీట్లో దాచేశాడు. అనంతరం బస్సును స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాడు. ఈ తతంగాన్ని స్థానికులు ఫోన్లో వీడియో తీసినా.. సదరు బస్సు డ్రైవర్ మాత్రం ఏ మాత్రం భయపడలేదు.