జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతా బలగాల మీద కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే కేపీ రోడ్డులో పోలీస్ పార్టీ మీద మిలిటెంట్లు దాడి చేశారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు.