20th Kargil Vijay Diwas : పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా... దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. అందులో బాగంగా నేషనల్ వార్ మెమరియల్ దగ్గర అమర సైనికులకు నివాళులు అర్పించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అయితే వారితో పాటు కార్గిల్ వీరులకు త్రివిధ దళాల అధిపతులు.. ఎయిర్ చీఫ్ మార్షల్ బిరెందర్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరాంబిర్ జమ్ము కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లా డ్రాస్‌లో నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో మర్చిపోలేని ఘట్టాల్లో ఒకటి కార్గిల్ యుద్ధం. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌తో వీరోచితంగా పోరాడి విజయం సాధించింది ఇండియన్ ఆర్మీ. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు.