పేడతో సాదారణంగా ఇల్లు అలకడం లేదా గోడలను పేడతో పూయడం చూస్తుంటాం. దీనివల్ల ఇంట్లో ఎండకాలం మరీ వేడిగా కాకుండా కొంత చల్లగా ఉంటుంది. అయితే అహ్మదాబాద్‌కు చెందిన సేజల్ షాహ్ అనే మహిళ ఈ సూత్రాన్ని తన కారుకు అన్వయించింది. పేడతో ఆ మహిళ కారు అద్దాలు, లైట్లు, కంపెనీ లోగో తప్పించి మొత్తం కారును ఆవు పేడతో పూసేసింది. అయితే కారును ఒకటి రెండు అంగుళాల మందంలో అలకడంతో కారు కొత్తరూపు సంతరించుకుంది. ఆ కారు ఫోటోలను ఆమె స్నేహితుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దానికి సంబందించిన వీడియో కూడా నెటిజెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.