గాలిలో అటూ ఇటూ తిరుగుతూ భోజనం చెయ్యడం వరైటీగా ఉంటుంది కదా. ప్రపంచంలో కొన్ని చోట్ల అలాంటి రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆగ్రాలో ప్రారంభమైంది. తాజ్ మహల్‌కి దగ్గర్లోనే ఇది ఉంది. ఇందులో బుక్ చేసుకున్న వారు... డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అందరూ కూర్చున్నాక... హైడ్రాలిక్ క్రేన్ ద్వారా 150 అడుగుల ఎత్తుకి తీసుకెళ్తారు. ఓ గంట, గంటన్నర పాటూ గాల్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది. ఆగ్రాలో తాజ్ అందాల్ని చూస్తూ... భోజనం చేసే వీలుంది.