ఒడిశా ఇటీవల రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ ట్యాగును పశ్చిమబెంగాల్ కూడా పొందింది. ఒడిశా తాజాగా 'అరిసా', 'చెన్న పొడ'లు అనే రెండు రకాల స్వీట్లకు కూడా జీఐ ట్యాగ్ పొందాలని ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా ఒడిశా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది కూడా.. గతంలో కూడా రసగుల్లాకు భౌగోళిక గుర్తింపుపై ఒడిశా ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత ‘ఒడిశా రసగొలా’ పేరిట జీఐ ట్యాగ్‌ను పొందింది.