తాజాగా ఆమీర్ ఖాన్ ‘లాల్ చంద్ చద్దా’ అనే కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్.. సిక్కు యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. గుబురు గెడ్డం, తల పాగాతో ఆమీర్ ఖాన్ గెటప్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కలకత్తాలోని హౌరా బ్రిడ్జిపై జరుగుతున్నది.ఈ సినిమాను వచ్చే యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సిమాను ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా స్పూర్తితో దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నాడు.