జమ్మూలోని పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది భారత సైనికులు అమరులైన విషయం మనకు తెలుసు. ఆ బాధిత కుటుంబాల్ని ఓదార్చేందుకు ముంబైకి చెందిన ఓ యువకుడు కారులో బయలుదేరాడు. మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లాలన్నది అతని ఆలోచన. తన పర్యటనను చారిత్రక దేశభక్తి ట్రిప్‌గా అతను చెబుతున్నాడు.