ఒంటరి మహిళపై దాడి చేయచేయాలని భావించిన ఓ దుండగుడు..ప్రజలచేత చావు దెబ్బలు తిన్నాడు. ముంబైలో ఓ అపార్ట్మెంట్లోకి లిఫ్ట్‌లో వెళ్తున్న ఓ మహిళను..దొంగ చాటుగా అనుసరించి..చివరగా అదును చూసి దోచుకోవాలని చుశాడు దుండగుడు. దీంతో ఆ మహిళ కాస్తా ప్రతిఘటించినా..ఫలితం లేకుండా పోయింది. అంతలోనే మరో యువకుడు..కొంత మంది రావడంతో..అందరూ కలిసి ఆ దుండగుడిని చితకబాదారు. ఈ వ్యవహారం అంతా సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.