Tigress beaten to death : గ్రామంలోకి దూరిన పులిని కర్రలతో కొడుతూ చంపేశారు గ్రామస్తులు.. . ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని పిలిబిత్లో ఓ పులి జనావాసాల్లోకి దూరింది. అంతేకాకుండా గ్రామస్తులపై దాడికి దిగింది. ఈ ఘటనలో 9 మంది తీవ్ర గాయాలపాలైయారు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు.. దాడి చేసిన పులిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. పులిని విచక్షణ రహితంగా కర్రలతో కొట్టారు. దీంతో దెబ్బలకు తట్టుకోలేని ఆ పులి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే పులిని చంపిన 43 మంది గ్రామస్తుల పై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.