యోగా డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హర్యానాలోని రోహతక్‌లో జరిగిన యోగా డే సంబరాల్లో కేంద్రహోంమంత్రి అమిత్ షా, సీఎం ఖట్టర్ పాల్గొన్నారు. ఐతే కార్యక్రమం తర్వాత అక్కడ గందరగోళం చెలరేగింది. యోగా మ్యాట్స్ కోసం స్థానికుల మధ్య తోపులాట జరిగింది. చేతికి ఎన్ని దొరికితే అన్ని మ్యాట్స్ని జనాలు ఎత్తుకెళ్లారు. వారిని కంట్రోల్ చేసేందుకు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది.