కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేరళలో పర్యటిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఓ కారులో ఉండగా, మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ యువకుడు రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇస్తూ ముద్దుపెట్టాడు.