హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పొలాల్లో కూలిన డ్రోన్... కర్ణాటకలో కలకలం

జాతీయం11:11 AM September 17, 2019

DRDO Drone : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో... మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో... ఓ డ్రోన్ కుప్పకూలింది. అది చూసిన స్థానికులు మొదట అది విమానం కావచ్చని అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లాక తెలిసింది అది డ్రోన్ అని. కాసేపటికి మరో విషయం తెలిసింది. అది రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కి చెందిన డ్రోన్ అని తెలిసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని సమాచారం. డ్రోన్‌లో ఎవరూ లేరు. అది పడిన చోట కూడా ఎవరూ లేరు. కారణం... జోడిచిక్కెనహళ్లిలోని వ్యవసాయ పొలాల్లో అది పడింది. ప్రస్తుతం DRDO అధికారులు అక్కడకు వెళ్లారు. చిత్రదుర్గ జిల్లాలోని DRDO ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోనే టెస్ట్ రేంజ్ ఉంది. దాన్ని చల్లాకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) అంటారు. అక్కడ మనుషులు నడపని డ్రోన్లను పరీక్షిస్తారు. కూలిన డ్రోన్... రస్టం-2 డ్రోన్ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. డ్రోన్ ఏ లోపంతో కూలిపోయిందో DRDO అధికారులు తెలుసుకుంటున్నారు. ఐతే... అది పొలాల్లో కూలడంతో స్థానికులు అక్కడకు పరుగున వచ్చి... దానిపై ఎక్కి నానా సందడి చేశారు. ఎప్పుడూ లేనిది ఓ డ్రోన్ తమ పొలాల్లో కూలిపోవడంతో... దాన్ని వింత వస్తువు చూసినట్లు వాళ్లు చూస్తున్నారు. నిజమే మరి... మన పొలాల్లోకి ఓ విమానం వచ్చి పడితే... మనమూ అలాగే ఆశ్చర్యంగా చూస్తాం కదా.

Krishna Kumar N