HOME » VIDEOS » National

Video: 86 ఏళ్ల వయసులోనూ చదువు.. ఇప్పటికే 13 పీజీలు

ఇండియా న్యూస్21:26 PM February 05, 2020

ఈయన పేరు విష్ణు ప్రసాద్ వర్మ. స్వస్థల రాజస్థాన్‌లోని బారాన్. వృత్తిరీత్యా న్యాయవాది. సాధారణంగా 70 ఏళ్ల వయసున్న వృద్ధులు ఇంటి పట్టునే ఉంటారు. ఒంట్లో సత్తువ తగ్గి మంచంపై విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈయన అలా కాదు. '60 ఏళ్ల వయసులో మీరేం సాధిస్తారు?' అని భార్య అనడంతో.. దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పట్టుదలతో శ్రమించి ఇప్పటి వరకు 13 పీజీలు సాధించారు. 14వ పీజీకి దరఖాస్తు చేసి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇన్ని పీజీలు సాధించిన తొలి భారతీయుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 15 పీజీలతో ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఉంది. మరో 3 పీజీలు సాధిస్తే ఆ రికార్డును విష్ణు ప్రసాద్ వర్మ బద్ధలు కొడతారు. ఆ లక్ష్యంతోనే ఇంకా చదువుతున్నారు.

webtech_news18

Top Stories