మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఆటోను ఢీకొట్టిన ఓ బస్సు..అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరో 28 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు.