HOME » VIDEOS » National

పుకార్లకు చెక్... గురుగ్రామ్‌లో ఓటువేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశాడు. ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో నివసిస్తున్న విరాట్ కోహ్లీ అక్కడే ఓటు వెయ్యాలనుకున్నాడు. ఐతే... గడువులోగా కొత్త ఓటర్ కార్డును నమోదు చేసుకోలేకపోయాడు. దాంతో ఈసారి ఎన్నికల్లో టీమిండియా కెప్టెన్ ఓటు వేసే హక్కు కోల్పోయాడని వార్తలు వచ్చాయి. అయితే దానిపై స్పందించిన కోహ్లీ మే 12న తన పాత నివాసం గురుగ్రామ్‌లో ఓటు వేస్తానన్నాడు. అన్నట్లుగానే ఓటు వేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని సెలబ్రిటీలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సందేశం పంపారు. విరాట్ కోహ్లీ కూడా ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచడంలో భాగస్వామ్యం అందించాలని విఙ్ఞప్తి చేశారు.

Krishna Kumar N

Top Stories