రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా చూపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలోని బీజేపీకి షాక్ ఇస్తూ... కాంగ్రెస్ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ ఇంటి దగ్గర అభిమానులు టపాకాయలు కాల్చి... విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.