PubG Game : పబ్జీ గేమ్ ఇండియాలో లేనిపోని సమస్యలు తెస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిందో దారుణం. సూరజ్‌పూర్‌లో ఇద్దరు విద్యార్థులు ఆన్లైన్లో పబ్జీ ఆడుకుంటూ... ఒకరి గేమ్ ఒకరు చూసుకున్నారు. అదే సమయంలో ఆన్లైన్లో మరో వ్యక్తికీ, వీళ్లిద్దరికీ మధ్య గొడవ జరిగింది. అతని తాలూకు వ్యక్తులు నలుగురు వచ్చి... వీళ్లిద్దర్నీ చితకబాదారు. చివరకు గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. భట్గావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్జీ గేమ్ ఇలాంటి చాలా అనర్థాలు తెస్తోందనీ, చదువుపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్థులు ఈ గేమ్ ఉచ్చులో చిక్కి... కెరీర్ నాశనం చేసుకుంటున్నారని పోలీసులు అంటున్నారు.