భయంకర తుఫాను జపాన్ను వణికిస్తుంది. హగిబిస్ తుపాను సృష్టించిన బీభత్సానికి ఆ దేశం అతలాకుతలమైంది. తుఫాను వల్ల రాజధాని టోక్యోతో పాటు జపాన్ పసిఫిక్ తీర ప్రాంతంలో 80 సెం.మీ. వర్షపాతం, గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నట్లు జపాన్ వాతావరణ విభాగం హెచ్చరించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 14మంది మృతిచెందారు.