HOME » VIDEOS » National » 35 PEOPLE DEAD IN FIRE INCIDENT AT RANI JHANSI ROAD SAYS DELHI POLICE AVR

Video : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 44మంది మృతి

ఇండియా న్యూస్14:06 PM December 08, 2019

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్‌మండిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. అనాజ్‌మండిలో ప్లాస్టిక్ తయారీ భవనంలో మంటలు వ్యాపించాయి. విపరీతమైన పొగ, మంటలతో ఊపిరాడక 32మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసినట్లు సమాచారం. దీంతో ప్లాస్టిక్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ ప్లాస్టిక్ కాలిన వాసనకే... అనేకమంది ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. మరో 50 మందికి గాయాలయ్యాయి. 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేస్తున్నాయి. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్థరాత్రి భవనంలో మంటలు చెలరేగి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

webtech_news18

Top Stories