ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో... 34 మంది నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయారు. మావోయిస్టులపై పోలీసులు జరుపుతున్న పోరాటంలో ఇదో ముందడుగు అనే చెప్పాలి. సాధారణంగా సుక్మా జిల్లాలో మావోయిస్టులు... పోలీసులపై, ఆర్మీ దళాలపై దాడులు చేస్తూనే ఉంటారు. దాదాపు ఆ ప్రాంతాన్ని వాళ్లు తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి యత్నిస్తుంటారు. అలాంటి చోట ఇంతమంది మావోయిస్టులు లొంగిపోయారంటే దానర్థం... మావోయిస్టుల ఉద్యమం పలచబడుతోందనే. పోలీసులు తమ ప్రయత్నాలను మరింత పెంచితే... ఇంకా చాలా మంది నక్సలైట్లు ప్రజా జీవితంలోకి వచ్చే అవకాశాలుంచాయి.