జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌లో ఒక ఇంట్లో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.ఇందులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా కూడా ఉండటం గమనార్హం. దాదాపు 12 గంటల పాటు సాగిన ఆపరేషన్‌లో ఉగ్రవాదుల చేతిలో బంధీలుగా ఉన్నవారిని సురక్షితంగా విడిపించారు.అయితే ఈ ఆపరేషన్‌లో ఒక భారత జవాన్ అమరుడవగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆపరేషన్ అనంతరం జవాన్లు విజయ నినాదాలు చేశారు.