సౌత్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.