జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలకు వెళ్లారు. ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. పుల్వామా ఎన్కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను మరోసారి నిలిపివేశారు.