30 ఏళ్ల కిందటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్ ఇవాళ కోర్టులో లొంగిపోయాడు. ఆయన్ను పోలీసులు మాండోలీ జైలుకి తరలించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ... ఆయన ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను లొంగిపోవడానికి నెల రోజులు గడువు కావాలనీ, తన కుటుంబం, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి తనకు ఈ గడువు కావాలని సజ్జన్ కోరారు. అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. పిటిషన్ను కొట్టివేసింది. అందువల్ల సజ్జన్ కుమార్ లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సజ్జన్ లొంగిపోయిన తర్వాత కస్టడీ వారెంట్ రెడీ చేసిన అధికారులు... ఆయన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య... జైలుకి తరలించారు.