యూపీలోని మవూ జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. వలీద్పూర్ గ్రామంలో సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. మరికొందరికి గాయాలయ్యాయి. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐతే ఇది ప్రమాదమా..? లేదంటే సిలిండర్ గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.