హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఉత్తరప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు

జాతీయం08:29 AM April 20, 2019

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం అర్థరాత్రి దాటాక హౌరా-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 13మంది గాయపడినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలు హౌరా నుంచి ఢిల్లీ వెళ్తుండగా కాన్పూర్ జిల్లాలోని రూమా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు బోగీలు పక్కకు పడిపోయాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు నార్త్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ ఆఫీసర్ అమిత్ మాలవియ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. సహాయక చర్యల కోసం 1072, 9454403738, 9454401463, 9454401075 హెల్ప్ నంబర్స్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading