హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో సినిమా దర్శకుడు సుజిత్ మీద హీరో ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. సాహో సినిమా కథ చెప్పడానికి నిక్కర్ వేసుకుని వచ్చాడంటూ ఛలోక్తులు విసిరాడు. 22 ఏళ్ల వయసుకే సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ మీద ప్రశంసలు కురిపించాడు.