అందం, అభినయంతో ఆకట్టుకునే రకుల్ ప్రీత్... ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఎప్పుడు చూసినా అవర్ గ్లాస్ బాడీతో ఉండే ఈ బ్యూటీ... ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. ఐతే... ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే... తాను చేసే ఎక్సర్‌సైజ్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది ఈ క్యూటీ. రకుల్ మార్నింగ్ లేవగానే రెండు గ్లాసుల గోరు వెచ్చటి నీరు తాగుతుంది. నెక్ట్స్ బ్లాక్ కాఫీలో 5 గ్రాముల నెయ్యి వేసుకొని... బులెట్ కాఫీ తాగుతుంది. ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉండే ఆహారం తింటుంది. జిమ్‌లో వర్కవుట్‌కి ముందు గుడ్లు, జొన్న రొట్టెలు తింటుంది. మధ్యాహ్నం బ్రౌన్ రైస్, చికెన్, కూరగాయలు, పప్పు, చేపలు తింటుంది. రాత్రివేళ మాత్రం సలాడ్స్, గ్రిల్డ్ ఫిష్, కూరగాయలే తింటుంది. పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకుంటుంది.