నల్లమలలో యురేనియం తవ్వకాలపై కేంద్రం సిద్ధమవుతున్న వేళ సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఒక్కటవుతున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వీల్లేదంటూ ఇప్పటికే చాలామంది తేల్చి చెప్పారు. తాజగా యూరేనియం తవ్వకాలపై అనుమతులు ఇవ్వలేదని కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు.