విక్టరీ వెంకటేష్ 74వ చిత్రం 'నారప్ప' రెగ్యులర్ షూటింగ్ అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ రీమేక్ లో వెంకటేష్ నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్.థానుతో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది.