సినిమా వారసత్వాన్ని కాపాడుకునేందుకు డిసెంబరులో 5వ ఫిల్మ్ ప్రిజర్వేషన్ & రిస్టోరేషన్ వర్క్‌షాప్ ఇండియా 2019ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నట్లు సినీనటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. వయాకామ్18 భాగస్వామ్యంతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ నిర్వహించనున్నాయని ఆయన వెల్లడించారు. పాతకాలం నాటి అద్భుత సినిమాలైన దేవాదాసు, పాతాలభైరవి, గుండమ్మకథ తదితర చిత్రాలను భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉందని వయాకామ్18 సీఈవో శివేంద్ర అన్నారు.