రకుల్‌ప్రీత్ సింగ్, పూజాహెగ్దే... ఇద్దరు టాలీవుడ్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోయిన్లు. రకుల్ కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటే, పూజా టాలీవుడ్ బడా హీరోలతో సినిమాలు కమిట్ అయ్యింది. అయితే ఇద్దరికీ ఓ విషయంలో మాత్రం పోలిక ఉంది. అదే ఫిట్నెస్. ఇద్దరూ ఫిట్నెస్ అంటే పడి చస్తారు. ఇద్దరి జిమ్ ట్రైనర్ కూడా ఒక్కరే. తాజాగా జిమ్‌లో హోరాహోరీగా తలబడుతూ కనిపించారీ ముద్దుగుమ్మలు. ఈ వీడియోను వారిద్దరి ఫిజియో ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.