టాలీవుడ్లో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్లలో రకుల్‌ప్రీత్ సింగ్ ముందుంటుంది. ‘వెంకట్రాది ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయం తర్వాత ఒక్కసారిగా ఎన్.టీ.ఆర్, మహేష్‌బాబు, రామ్‌చరణ్, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఎన్.టీ.ఆర్’ బయోపిక్‌లో అతిలోకసుందరి శ్రీదేవి పాత్ర చేస్తోంది రకుల్. ఈ పాత్ర కోసం జిమ్‌లో చెమటోడుస్తూ, తెగ కసరత్తులు చేస్తోంది రకుల్.