కరోనా వైరస్ ప్రపంచ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. తాజాగా దీని భారిన పడకుండా ఉండేందుకు హీరో ప్రభాస్ మాస్కుతో దర్శనం ఇచ్చాడు. ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న సమయంలో ఆయన మాస్క్ ధరించాడు. ప్రభాస్ లాంటి నటులు మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం వస్తుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.