టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. అయితే గతంలో కూడా ఆయన చనిపోయినట్లు పలుసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయా మీడియా కథనాలపై వేణు మాధవ్ మండిపడ్డారు. నేను బతికి ఉంటే.. చనిపోయానంటూ వార్తలు రాస్తారా అంటూ పలు టీవీ ఛానల్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.